Sun Dec 22 2024 02:45:46 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాకు ఇక స్వర్ణయుగమే : డొనాల్డ్ ట్రంప్
తన జీవితంలో ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
తన జీవితంలో ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తన మద్దతుదారులతో సమావేశమైన ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ప్రజలు సాధించిన విజయమిది అన్నారు. సెనేట్ తో పాటు కాంగ్రెస్ లో కూడా రిపబ్లికన్లకే అధికారం లభించిందన్నారు. తన విజయానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ప్రజలు కష్టాలు తీరబోతున్నాయని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఇంతటి విజయాన్ని అమెరికన్ ప్రజలు ఎప్పుడూ చూడలేదని అన్నారు.
సరిహద్దులను నిర్ణయించి...
పాపులర్ ఓట్లలో కూడా తనదే విజయమన్న ట్రంప్ కొత్త చట్టాలను తీసుకు రావడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అమెరికాలో స్వర్ణయుగాన్ని తెస్తామని తెలిపార. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ఆయన అమెరికా ప్రజలను అభినందించారు. సరిహద్దులను నిర్ణయించి ఎన్నికల్లో చెప్పిన హామీలన్నింటినీ తాను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రజలు గర్వపడేలా, వారి ఆకాంక్షలు నెరవేరేలా చేస్తానని ట్రంప్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Next Story