Sun Dec 22 2024 03:14:25 GMT+0000 (Coordinated Universal Time)
Amercia Elections : డొనాల్డ్ ట్రంప్ కే విజయావకాశాలు.. వైట్ హౌస్లో అడుగుపెట్టే ఛాన్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ విజయానికి చేరువలో ఉన్నారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ విజయానికి చేరువలో ఉన్నారు. తన ఫామ్ హౌస్ లో ట్రంప్ వాచ్ పార్టీ ఇస్తున్నారు. ఈ పార్టీకి ముఖ్యులు హాజరయ్యారు. ఎలాన్ మస్క్ కూడా హాజరయ్యారు. ట్రంప్ దాదాపు 247 ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించారు. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ 214 ఎలక్ట్రోరల్ ఓట్లను మాత్రమే తెచ్చుకోగలిగారు. అత్యధిక రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. ఎక్కువ మంది ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గు చూపినట్లు కనపడుతుంది. కౌంటింగ్ ప్రారంభమయిన నాటి నుంచి ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తక్కువ ఓట్లతో కమలా హారిస్ వెనుకబడే ఉన్నారు. దీంతో కమలా హారిస్ ముందుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని కూడా రద్దు చేశారు.
స్వింగ్ స్టేట్స్ లో...
విజయం తెచ్చిపెట్టే స్వింగ్ స్టేట్స్ లో కూడా ట్రంప్ ముందంజలోకి రావడంతో డెమొక్రాట్ల ఆశలో నీళ్లు చల్లినట్లయింది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ సొంతం చేసకున్నారు. మిగిలిన ఐదు స్వింగ్ స్టేట్స్ లోనూ డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యత కొనసాగుతుంది. ట్రంప్ జార్జియా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటనీ, టెన్నసీ, మిస్సోరి, మిసిసిపీ, ఒహయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్ కరోలినా రాష్ట్రాలలో ట్రంప్ కే ఆధికత్యత లభించింది. కాసేపట్లో ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
కమలాహారిస్ మాత్రం...
కమలా హారిస్ మాత్రం 214 ఎలక్ట్రోరల్ సీట్లను దక్కించుకున్నారు. హారిస్ ఇప్పటి వరకూ కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీ ల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవెర్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కొలరాడో, హవాయి, న్యూ హాంప్ షైర్ డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియాలో ఆధికత్యను సాధించారు. స్వింగ్ స్టేట్స్ లో అత్యధిక భాగం ట్రంప్ వైపు మొగ్గు చూపడంతో ఆయన విజయం దాదాపు ఖాయమయింది. ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రమే కమలా హారిస్ జోరు కనపడుతుంది. మొత్తం మీద చివరకు ట్రంప్ వైట్ హౌస్ లోకి తిరిగి అడుగుపెట్టడం ఖాయమనే అనిపిస్తుంది.
Next Story