Thu Dec 26 2024 22:09:03 GMT+0000 (Coordinated Universal Time)
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. కెర్మాడెక్ దీవులలో సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతగా నమోదయింది
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. కెర్మాడెక్ దీవుల రీజియన్‌లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతగా నమోదయినట్లు నేషనల్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. భారత కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం 6.11 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించినట్లు తెలిపారు.
సునామీ హెచ్చరిక...
దీంతో న్యూజిలాండ్ తీరంలో పెద్దయెత్తున అలలు పైకి ఎగిసిపడ్డాయి. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. పది కిలోమీటర్ల లోపు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Next Story