Thu Dec 26 2024 22:23:06 GMT+0000 (Coordinated Universal Time)
నేపాల్‌లో భూకంపం
నేపాల్‌లో భూకంపం సంభవించింది. ఒకటి కాదు గంటల వ్యవధిలోనే రెండుసార్లు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
నేపాల్‌లో భూకంపం సంభవించింది. ఒకటి కాదు గంటల వ్యవధిలోనే రెండుసార్లు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒకసారి మోస్తరుగా, మరొకసారి తేలికపాటి తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో నమోదయింది. రాత్రి 11.58 గంటలకు తొలిసారి భూకంపం సంభవించింది. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున మరొకసారి భూకంపం సంభవించింది.
రెండు గంటల వ్యవధిలోనే...
రెండు గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో సంభవించిన భూకంప ప్రభావంతో ఇటు భారత్‌లోని ఢిల్లీ, రాజస్థఆన్లోనూ భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.
- Tags
- earthquake
- nepal
Next Story