Mon Dec 23 2024 09:56:58 GMT+0000 (Coordinated Universal Time)
Earthquake : శ్రీలంకలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
శ్రీలంకలో భూకంపం సంభవించింది. రాజధాని కొలొంబోను వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదయింది
శ్రీలంకలో భూకంపం సంభవించింది. రాజధాని కొలొంబోను వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందోనని భయంతో వణికిపోయారు.
ఆస్తి, ప్రాణ నష్టంపై...
కొన్ని భవనాలు భూకంప తీవ్రతకు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కొలొంబోకి ఆగ్నేయ దిశగా 1,326 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోను భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియరాలేదు. అలాగే భారత్ లోని లద్దాఖ్ లోనూ భూమి కంపించింది. ఇక్కడ భూకంప తీవ్రత 4.4 గా నమోదయింది.
Next Story