Mon Dec 23 2024 23:13:52 GMT+0000 (Coordinated Universal Time)
మేఘాలయలో భూకంపం
మేఘాలయాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత నమోదయింది.
మేఘాలయాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత నమోదయింది. ఈరోజు ఉదయం ఈ భూకంపం సంభంవించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 6.32 నిమిషాలకు ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తురాకు తూర్పు ఈశాన్య దిశగా 43 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు.
టిబెట్, తుర్కియాలలోనూ....
మేఘాలయాతో పాటు టిబెట్, తుర్కియా దేశాల్లో సయితం భూకంపం సంభవించింది. ఇక్కడ తెల్లవారు జామున 4.01 నిమిషాలకు ఈ భూప్రకంపనలు కన్పించాయి. రిక్టర్ స్కేల్ 5.0 తీవ్రతగా నమోదయింది. అయితే మేఘాలయలోగాని, టిబెట్, తుర్కియా దేశాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.
Next Story