Mon Dec 23 2024 18:01:25 GMT+0000 (Coordinated Universal Time)
మరణించింది 920 మంది.. భయం భయంగా ప్రజలు..!
ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం కారణంగా మరణాల సంఖ్య పెరుగుతూ వెళుతోంది.
ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం కారణంగా మరణాల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. బుధవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 920 మంది మరణించారని, వేలల్లో గాయపడ్డారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్ నగరానికి దాదాపు 44 కి.మీ (27 మైళ్లు) దూరంలో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిసి) తెలిపింది. ధృవీకరించబడిన మరణాలలో ఎక్కువ భాగం తూర్పు ఆఫ్ఘన్ ప్రావిన్స్ పక్టికాలో ఉన్నాయి, ఇక్కడ 255 మంది మరణించారు.. 200 మందికి పైగా గాయపడ్డారని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి సలాహుద్దీన్ అయుబి చెప్పారు. ఖోస్ట్ ప్రావిన్స్‌లో 25 మంది మరణించారని, 90 మందిని ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు.
920 మంది మరణించారని విపత్తు నిర్వహణ డిప్యూటీ మంత్రి షరాఫుద్దీన్ ముస్లిం కాబూల్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు.పక్తికా ప్రావిన్స్‌లో 381 మంది మరణించారని, 205 మంది గాయపడ్డారని పక్తికా ప్రావిన్స్‌లో ఆరోగ్య శాఖ అధిపతి రఫీవుల్లా రాహెల్ తెలిపారు. టైమ్స్ నివేదిక ప్రకారం.. "స్పేరా జిల్లాలో నివసించే 26 ఏళ్ల సర్హాది ఖోస్తీ, తాను తెల్లవారుజామున 1 గంటల సమయంలో భూకంపం కారణంగా మేల్కొన్నాను. అనేక ఇళ్లు ముఖ్యంగా మట్టి లేదా చెక్కతో చేసినవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. హెలికాప్టర్లు కొంత మంది క్షతగాత్రులను కాబూల్, పొరుగు ప్రావిన్సులలోని ఆసుపత్రులకు తరలించాయని" తెలిపారు. అధికారులు గాయపడిన వారిని శిథిలాల కింద నుండి లాగడంలో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. నివేదిక ప్రకారం, 2008లో పాకిస్థాన్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిన ప్రదేశానికి ఉత్తర-ఈశాన్య దిశగా 300 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
కాబూల్‌లోనూ.. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోని ఉత్తర భాగంలో కూడా భూమి కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్లోని అనేక జనసాంద్రత కలిగిన పట్టణాలు, నగరాలు భూకంపం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రకృతి విపత్తు నిర్వహణ శాఖ సహాయ మంత్రి మౌలావీ షరాఫుదీన్ ముస్లిం తెలిపారు. ఆ ప్రాంతానికి టెంట్లు, దుప్పట్లు, నగదు, ఆహారం పంపినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది బాధ్యతలు చేపట్టిన తాలిబాన్ పాలనలో ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కార్యాలయం సహాయం కోసం విదేశీ సహాయ సంస్థలను కోరింది.
News Summary - Earthquake Strikes Afghanistan 920 People Have Already Lost Their Lives
Next Story