Sat Dec 28 2024 05:26:23 GMT+0000 (Coordinated Universal Time)
తజికిస్థాన్‌లో భారీ భూకంపం
తూర్పు తజికిస్థాన్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.8గా నమోదయింది
తూర్పు తజికిస్థాన్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈరోజు తెల్లవారు జామున భూకంపం సంభవించిందని చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.8గా నమోదయింది. తెల్లవారు జామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులై బయటకు పరుగులు తీశారు. టర్కీ భూకంప తీవ్రతను చూసిన ప్రజలు వణికిపోయారు. భూ ఉపరితలం నుంచి 20.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.
ఆస్తి, ప్రాణ నష్టం...
ఆప్ఘనిస్థాన్ - చైనా సరిహద్దుల్లో ఉన్న తూర్పు ప్రాంతమైన గోర్నో బదక్షన్ ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో తక్కువ జనాభా నివసిస్తుంటారని, అందుకే పెద్దగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. రెండు సార్లు భూకంపం సంభవించింది. తొలిసారి వచ్చిన భూకంపానికి ఇరవై నిమిషాల తర్వాత తిరిగి సంభవించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. రెండోసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.0గా నమోదయింది.
Next Story