Mon Dec 23 2024 07:23:02 GMT+0000 (Coordinated Universal Time)
కేజీ చికెన్ రూ.1000, ఒక గుడ్డు రూ.35
వంటగ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. నిత్యావసర వస్తువులు కూడా నిండుకోవడంతో.. ప్రజలు వాటికోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి.
శ్రీలంక : కరోనా కొట్టిన చావుదెబ్బ నుంచి ప్రపంచ దేశాలు ఇంకా కోలుకోలేదు. ఉద్యోగులు నిరుద్యోగులుగా మారడంతో పాటు.. పలు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. తాజాగా కరోనా కారణంగా శ్రీలంక లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఫలితంగా టీ, వస్త్ర, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదాయం లేకపోగా.. ఖర్చులు పెరగడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. శ్రీలంకన్ కరెన్సీలో 230 రూపాయలుగా ఉన్న డాలర్ విలువ 270కి పెరిగింది. దాంతో అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
వంటగ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. నిత్యావసర వస్తువులు కూడా నిండుకోవడంతో.. ప్రజలు వాటికోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి.తాజాగా అక్కడ కేజీ చికెన్ రూ.1000కి చేరింది. అలాగే ఒక కోడిగుడ్డు ధర రూ.35, కిలో ఉల్లిపాయలు రూ.250, కేజీ బియ్యం రూ.200కి పెరిగిపోయాయి. 1970లో వచ్చిన కరువు కంటే.. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని అంటున్నారు స్థానికులు. శ్రీలంకకు గ్యాస్ సరఫరా చేసే లిట్రోగ్యాస్, లాఫ్స్ గ్యాస్ తాత్కాలికంగా సరఫరాను నిలిపేశాయి. గ్యాస్ కొరత కారణంగా.. 90శాతం రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. కర్రల పొయ్యి పై వంట చేసే కొన్ని చిన్నచిన్న రెస్టారెంట్లు మాత్రం నడుస్తున్నాయి.
Next Story