Mon Dec 23 2024 08:07:56 GMT+0000 (Coordinated Universal Time)
జెరూసలేంలో దాడి.. ఎనిమిది మంది మృతి
జెరూసలేంలోని ప్రార్థనామందిరంలో జరిగిన దాడిలో దాదాపు ఎనిమిది మరణించారు. ఉగ్రదాడిగా దీనిని అనుమానిస్తున్నారు.
జెరూసలేంలోని ప్రార్థనామందిరంలో జరిగిన దాడిలో దాదాపు ఎనిమిది మరణించారు. ఉగ్రదాడిగా దీనిని అనుమానిస్తున్నారు. ఇజ్రాయిల్ లోని నెవ్ యాకోవ్ స్ట్రీట్ లోని ప్రార్థనా మందిరం సమీపంలో జరిగిన ఉగ్రవాడుల దాడిలో ఎనిమిది మంది మరణించగా పది మంది గాయాలపాలయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గాయపడిన వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఉగ్రవాది హతం...
దాడి జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని చర్యలు ప్రారంభించాయి. గాయాలపాలయిన వారికి వెంటనే చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరిగిన ఉగ్రవాది పోలీసుల కాల్పుల్లో మరణించడాని అధికారులు వెల్లడించారు. పాలస్థానీ ఉగ్రవాదుల దాడుల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉందని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Next Story