Sat Nov 02 2024 19:44:18 GMT+0000 (Coordinated Universal Time)
Japan : నేడు జపాన్ ప్రధాని ఎన్నిక
నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 9 మంది అభ్యర్థులు నిలిచారు.
నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 9 మంది అభ్యర్థులు నిలిచారు. కొత్తగా జపాన్ ప్రధాని అయిన వారు వచ్చే ఏడాది అక్టోబరులో జరిగే దిగువ సభ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాని ఎన్నికకు ఎంపీలు ఓటు వేస్తారు.
మొత్తం 9 మంది అభ్యర్థులు...
మొత్తం 368 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాని పదవి కోసం ప్రస్రుత మంత్రులతో పాటు మాజీ మంత్రులు కూడా పోటీ పడుతున్నారు. తొలి రౌండ్ లో మొత్తం 736 ఓట్లు ఉంటాయని. మొదటి రౌండ్ లో యాభై శాతం ఓట్లు సాధించిన వారిని ప్రధానిగా ఎన్నుకుంటారు. అయితే తొలి రౌండ్లో యాభై శాతం సాధించడం తొమ్మిది మంది అభ్యర్థులకు కష్టమేనని విశ్లేషకులు చెబుతను్నారు. దీంతో రెండో రౌండ్ ఓటింగ్ జరిగే అవకాశముందని అభప్రాయం వ్యక్తం అవుతుంది. ఎంపీలతో పాటు 47 మంది స్థానిక ప్రతినిధులు ఓటు వేయనున్నారు.
Next Story