Mon Dec 23 2024 02:58:45 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్ బ్లూటిక్ కు 8 డాలర్లు చెల్లించాల్సిందే : మస్క్
ఇకపై బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు (రూ.661) చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఈ ధర ఒక్కో దేశంలో ఒక్కో విధంగా..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను తిరిగి తనచేతిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చి రాగానే ట్విట్టర్ సీఈఓ తో సహా పలువురు ఉద్యోగులపై వేటు వేశారు. పెద్దతలకాయలన్నింటినీ సాగనంపిన మస్క్.. నిదానంగా ఒక్కొక్కటిగా తన ట్రేడ్ మార్క్ నిర్ణయాలను అమలు చేసే పనిలో పడ్డారు. ట్విట్టర్ రూల్స్ ను మారుస్తున్నారు. ట్విట్టర్ లో సెలబ్రిటీ ఖాతాలకు కేటాయించే బ్లూటిక్ ఫీజును పెంచుతున్నట్టు మస్క్ ప్రకటించారు.
ఇకపై బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు (రూ.661) చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఈ ధర ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉండొచ్చని పేర్కొన్నారు. దీనిపై వస్తున్న స్పందనలకు బదులిచ్చిన మస్క్.."ఫిర్యాదులు చేసేవాళ్లందరికి ఒకటే చెబుతున్నా.. దయచేసి మీరు ఫిర్యాదు చేస్తూనే ఉండండి.. కానీ దీని ఖరీదు మాత్రం 8 డాలర్లు" అంటూ బ్లూ టిక్ ఫీజు పెంపుపై తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గతంలో ఈ ఫీజు రూ.661గా ఉండేది.
Next Story