Mon Dec 23 2024 09:11:07 GMT+0000 (Coordinated Universal Time)
ఇమ్రాన్ కు ఇంత పెద్ద షాకా?
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు పాక్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు పాక్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మరో ఐదేళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని చెప్పింది. అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల నుంచి వచ్చిన అనేక బహుమతులను చట్టవిరుద్ధంగా అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై చీఫ్ ఎన్నికల కమిషన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం విచారించింది.
విదేశీ బహుమతులను...
దీనిపై విచారించిన ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు వేసింది. ఎన్నికల సంఘం తీర్పు చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలోనూ పదవిని కోల్పోతారు. మరో ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదు. దీనిపై ఇమ్రాన్ అనుచరులు ఆందోళనకు దిగారు. తమ నేతను కావాలని కక్ష కట్టి పోటీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ కు మాత్రం రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
Next Story