Mon Dec 23 2024 15:25:44 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మాయిని అబ్బాయిగా మారుస్తానంటూ.. నిండు గర్భిణీ తలలో మేకు దించిన దొంగ బాబా
తలలో మేకు ఎందుకు దిగిందో తెలుసుకున్న వైద్యులు బిత్తరపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పెషావర్ కు చెందిన ఓ వివాహితకు
ఈ టెక్నాలజీ యుగంలో.. కొత్త పుంతలు తొక్కుతూ, కొత్త సాంకేతికత పురుడు పోసుకుంటున్న ఈ రోజుల్లో.. ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతున్నాయా ? అంటే ఖచ్చితంగా లేదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఎందుకో.. చాలా మంది మూఢనమ్మకాలతోనే బ్రతుకుతున్నారు. వారిని ఆసరాగా చేసుకుని దొంగబాబాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. మూఢనమ్మకాలను విశ్వసించే సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. తాజాగా మన పొరుగు దేశమైన పాకిస్థాన్ లో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ.
నిండు గర్భిణీ తలలో ఇనుప మేకును దించాడో దొంగబాబా. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మేకును తొలగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ.. తలలో మేకు ఎందుకు దిగిందో తెలుసుకున్న వైద్యులు బిత్తరపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పెషావర్ కు చెందిన ఓ వివాహితకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లాడి కోసం కాన్పు ఆపడంతో.. మరోమారు ఆమె గర్భం దాల్చింది. ఈసారి అబ్బాయి పుట్టకపోతే.. వదిలేస్తానని భర్త బెదిరించాడు. నెలలు నిండుతుండటంతో పుట్టేది ఆడపిల్లేనన్న అనుమానం ఆమెను నిలకడగా ఉండనివ్వలేదు. ఈ గండం నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. ఆమె ఒక బాబా గురించి తెలుసుకుంది. ఎలాగో ఆయనను కలిసి తన సమస్యను వివరించింది. గర్భిణీ చెప్పిందంతా విన్న ఆ మాయల ఫకీరు.. ఊహించని సలహా ఇచ్చాడు.
Also Read : తెలంగాణలో టెన్త్ పరీక్షలకు షెడ్యూల్ సిద్ధం
తలలో మేకు దించితే.. లోపల పెరుగుతున్నది ఎవరైనా సరే అబ్బాయే పుడతాడని నమ్మించారు. దొంగబాబా మాయ మాటలను గుడ్డిగా నమ్మిన ఆమె.. తలలో మేకు కొట్టించుకునేందుకు సిద్ధమైంది. రెండు అంగుళాల మేర తలలో మేకును దించారు. ఆ నొప్పిని భరించలేక విలవిల్లాడిపోయింది ఆ నిండు గర్భిణీ. వెంటనే కుటుంబసభ్యులు మేకును తీసేందుకు ప్రయత్నించగా.. ఫలితం లేకపోవడంతో లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించారు. గర్భిణీని పరీక్షించిన అక్కడి వైద్యులు.. మేకు పుర్రెను చీల్చుకుని వెళ్లిందని, అది మెదడును తాకకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. అసలు తలలోకి మేకెలా వెళ్లిందని వైద్యులు ఆరా తీయగా.. జరిగిందంతా చెప్పారు. గర్భిణి తలలో మేకు ఉన్న ఎక్స్రే ఫొటోలు అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ.. వారు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలియడంతో దొంగబాబా పరారయ్యాడు.
Next Story