Tue Dec 24 2024 14:15:24 GMT+0000 (Coordinated Universal Time)
జూ.ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ నేతల దాడి
తరని పరుచూరి - సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నాయి. రెండుగా చీలిపోయాయి. టీడీపీ మీటింగ్..
తానా సభల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ నేతలు దాడి చేశారు. అమెరికా జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(Telugu Association of North America) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. తరని పరుచూరి - సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నాయి. రెండుగా చీలిపోయాయి. టీడీపీ మీటింగ్ "జై ఎన్టీఆర్" అనే నినాదం వినిపించడంతో ఇరువర్గాలు కొట్టుకున్నాయి. టీడీపీకి జూ.ఎన్టీఆర్ కి ఏం సంబంధం అంటూ లోకేష్ అభిమానులు ప్రశ్నించడంతో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగినట్లు సమాచారం. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
అమెరికాలో సుదీర్ఘ చరిత్ర ఉన్న తానాకు ఫిలడెల్ఫియాలో జరిగిన అనూహ్య ఘటన ఊహించని ఇబ్బంది తెచ్చిపెట్టింది. 23వ తానా సభలను శనివారం ఘనంగా ప్రారంభించగా.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తదితరులు వేడుకలను ప్రారంభించారు. తొలిరోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన తర్వాత తానాలో కొందరు సభ్యులు కన్వెన్షన్ సమీపంలోని హాల్లో సమావేశమయ్యారు. టీడీపీకి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చిస్తుండగానే తరని పరుచూరి - సతీష్ వేమన వర్గాల మధ్య వివాదం చెలరేగింది. 2024లో టీడీపీకి పరాభవం తప్పదన్న అభిప్రాయం వ్యక్తం అయిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తన్నులాట జరిగినట్లు తెలుస్తోంది.
Next Story