Mon Nov 18 2024 03:34:15 GMT+0000 (Coordinated Universal Time)
బోటులో అగ్నిప్రమాదం.. 32 మంది దుర్మరణం
ప్రమాద సమయంలో పడవలో 500 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. లోకల్ పోలీసు చీఫ్ మెయినల్ ఇస్లాం తెలిపిన వివరాల ప్రకారం..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. సౌతరన్ బంగ్లాదేశ్ లో ఫెర్రీ బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫెర్రీ బోటులో ప్రయాణిస్తున్న 32 మంది దుర్మరణం చెందగా.. మరో 100 మందికి తీవ్రగాయాలైనట్లు బంగ్లా పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో 500 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. లోకల్ పోలీసు చీఫ్ మెయినల్ ఇస్లాం తెలిపిన వివరాల ప్రకారం.. నదిలో బోటు ప్రయాణిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని కొంతమంది మరణించగా.. మరికొందరు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
శుక్రవారం ఉదయం బంగ్లా రాజధాని ఢాకాకు దక్షిణంలో 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝక్కాథి రూరల్ టౌన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకూ 32 మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా.. గతంలో చాలాసార్లు నదులు దాటే క్రమంలో బోటులు ప్రమాదాలకు గురవ్వగా.. తాజాగా ఫెర్రీబోటు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రస్తుతం బోటులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story