Tue Dec 24 2024 02:58:40 GMT+0000 (Coordinated Universal Time)
సరిహద్దుల్లో కాల్పుల మోత
ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత యుద్ధానికి సంకేతంగా మారింది. రాష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం అనివార్యమపిసిస్తుంది.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత యుద్ధానికి సంకేతంగా మారింది. రాష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం అనివార్యంగా కన్పిస్తుంది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని కాడివ్కా లో కాల్పులు జరిగాయి. రష్యాకు మద్దతిస్తున్న వేర్పాటు వాదులు, ఉక్రయిన్ దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడినట్లు సమాచారం. వేర్పాటు వాదులే తొలుత కాల్పులు ప్రారంభించారని ఉక్రెయిన్ సైన్యం చెబుతుంది.
పరస్పర ఆరోపణలు...
ఉక్రెయిన్ సైన్యమే తొలుత కాల్పులు ప్రారంభించిందని, నాలుగు సార్లు కాల్పులు జరపడంతో తాము ఎదురుదాడికి దిగాల్సి వచ్చిందని వేర్పాటు వాదులు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని దేశాలు తమ పౌరులను ఉక్రెయిన్ నుంచి వెనక్కు రావాల్సిందిగా పేర్కొన్నాయి. భారత్ పౌరులను దేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. కాల్పులు ప్రారంభం కావడంతో రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్దం అనివార్యంగా కన్పిస్తుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Next Story