Fri Jan 03 2025 22:05:12 GMT+0000 (Coordinated Universal Time)
Newzealand : న్యూజిలాండ్ లో ప్రారంభమైన న్యూ ఇయర్ వేడుకలు
ప్రపంచంలో మొదట న్యూ ఇయర్ వేడుకలు న్యూజిలాండ్ లో ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ లో వైభవంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించారు
ప్రపంచంలో మొదట న్యూ ఇయర్ వేడుకలు న్యూజిలాండ్ లో ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ లో వైభవంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించారు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు మిన్నంటాయి. న్యూజిలాండ్ వాసులు అప్పుడే కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఆక్లాండ్ స్కూ టవర్ వద్ద న్యూఇయర్ వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు.
ఆక్లాండ్ లో తొలిగా...
భారత్ కాల మాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకే అక్కడ కొత్త ఏడాది ప్రవేశించింది. ప్రపంచంలోనే తొలిసారి కొత్త ఏడాది ఆక్లాండ్ నగరంలో ఎంటర్ అవుతుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాల మధ్య ఆక్లాండ్ వాసులు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో భారత్ లో కూడా నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి.
Next Story