Fri Nov 22 2024 10:09:12 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి మనిషి నుంచి కుక్కకు సోకిన మంకీపాక్స్
మంకీపాక్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఆయా దేశాలు ప్రకటించాయి. తాజాగా మంకీపాక్స్..
కరోనా మహమ్మారి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో.. మరో కొత్త వ్యాధి ప్రపంచాన్ని భయపెడుతోంది. మంకీపాక్స్ గా పిలువబడే ఈ వ్యాధి కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మంకీపాక్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఆయా దేశాలు ప్రకటించాయి. తాజాగా మంకీపాక్స్ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా సోకే ప్రమాదం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఘటన ఫ్రాన్స్ లో జరిగింది.
ఫ్రాన్స్ లో ఉంటోన్న దంపతులకు మంకీపాక్స్ సోకింది. ఆ దంపతులు నిద్రిస్తున్న బెడ్ పైనే తమ పెంపుడు కుక్క కూడా పడుకునేది. ఉన్నట్లుండి కుక్క అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆ కుక్కకు మంకీపాక్స్ నిర్థారణ అయింది. ప్రపంచంలో మనుషుల నుంచే పెంపుడు జంతువులకు మంకీపాక్స్ సోకిన మొట్టమొదటి కేసు ఇదే కావడం గమనార్హం. ఇంతకుముందు ఎలుకలు, అడవి మృగాల్లో ఈ వైరస్ నిర్థారణ అయింది.
కాగా.. మంకీపాక్స్ సోకిన పెంపుడు జంతువులకు 21 రోజులపాటు దూరంగా ఉండాలని అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) సూచించింది. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ లోనూ మంకీపాక్స్ కేసులు ఉండగా.. దీనిని నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యాధికి ఇంకా సరైన మెడిసిన్ కనుగొనలేదని తెలిసిందే.
Next Story