Mon Dec 23 2024 14:51:43 GMT+0000 (Coordinated Universal Time)
కోవిడ్ కు కొత్త టాబ్లెట్... వినియోగానికి అనుమతి
కోవిడ్ పై తొలి విజయం కన్పిస్తుంది. అమెరికాలో ఫైజర్ సంస్థ కోవిడ్ వ్యాధి తగ్గడానికి టాబ్లెట్ ను రూపొందించిది
కోవిడ్ పై తొలి విజయం కన్పిస్తుంది. అమెరికాలో ఫైజర్ సంస్థ కోవిడ్ వ్యాధి తగ్గడానికి టాబ్లెట్ ను రూపొందించిది. దీనికి అత్యవసర వినియోగానికి ఎఫ్డీఏ అనుమతి ఇచ్చింది. దీనికి పాక్స్ లోవిడ్ గా నామకరణం చేశారు. కోవిడ్ సోకిన వారు ఈ ట్యాబ్లెట్ ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారే ఈ ట్యాబ్లెట్ ను ఉపయోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ రూపొందించడంతో కోవిడ్ ను సులువుగా అరికట్టవచ్చన్న నమ్మకం ఏర్పడిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అత్యవసరంగా....
ఫైజర్ సంస్థ ఇప్పటికే చిన్న పిల్లలకు వ్యాక్సిన్ డెవలెప్ చేసింది. కరోనా వ్యాక్సిన్ ను రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసింది. కోవిడ్ ను అరికట్టడానికి ట్యాబ్లెట్ ను కూడా రూపొందించడంతో ఈ వ్యాధి సోకిన వారు భయపడాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద చరిత్రలో తొలిసారి కోవిడ్ కోసం ట్యాబ్లెట్ వచ్చేసింది.
Next Story