Mon Nov 18 2024 08:36:25 GMT+0000 (Coordinated Universal Time)
ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్
ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బందిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. దక్షిణ యెమెన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది
ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బందిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. దక్షిణ యెమెన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. యుఎన్ అధికార ప్రతినిధి రస్సెల్ గికీ చెప్పిన వివరాల ప్రకారం ఒక మిషన్ లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది యెమెన్ లో పనిచేస్తున్నారు. వారు కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కిడ్నాప్ చేశారు. ఐదుగురు సభ్యులు కిడ్నాప్ కు గురయినట్లు గుర్తించామని చెప్పారు.
ఆ గ్రూపు పనేనా?
అయితే కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కిడ్నాప్ జరిగి దాదాపు ముప్ఫయి గంటలు దాటుతుండటంతో ఆందోళన వ్యక్తమువుతుంది. వారిని రక్షించేందుకు ఐక్యారాజ్యసమితి అధికారులు యెమెన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా కిడ్నాప్ చేసిన వారి డిమాండ్లు మాత్రం ఇంకా తెలియరాలేదు. హౌతీ గ్రూప ఈ కిడ్నాప్ నకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలున్నాయి.
Next Story