Mon Dec 23 2024 08:41:14 GMT+0000 (Coordinated Universal Time)
ఇమ్రాన్ పై కాల్పులు.. కారణం ఇదేనా?
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆయన ప్రయాణిస్తున్న కంటైనర్ ట్రక్ పై ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ తో పాటు మరికొందరికి గాయాలయినట్లు తెలుస్తోంది. ఆయన కాలికి బుల్లెట్ గాయమయిందన్న వార్తలు వస్తున్నాయి. పాక్ మీడియా కథనం ప్రకారం పంజాబ్ లోని వాజిరాబాద్ పట్టణంలోని అల్లావాలా చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
సురక్షితమే కాని...
అయితే ఈ ఘటనలో గాయపడిన ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ఎటువంటి ముప్పులేదని పాక్ కు చెందిన జియో టీవీ తెలిపింది. ప్రస్తుతం సురక్షితంగానే ఆయన ఉన్నారని పేర్కొంది. కాల్పులు జరిగిన వెంటనే ఆయనను బుల్లెట్ ప్రూఫ్ కారులోకి మార్చారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, విచారణ జరుగుతుందని చెబుతున్నారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ సన్నిహితుడు ఫైజల్ జావేద్ కూడా గాయపడ్డారని చెబుతున్నారు.
Next Story