Fri Nov 22 2024 22:11:21 GMT+0000 (Coordinated Universal Time)
థాయ్లాండ్ కు గొటబాయ
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే థాయ్ లాండ్ లో తలదాచుకునేందుకు అనుమతి లభించింది
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే థాయ్ లాండ్ లో తలదాచుకునేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు థాయ్ లాండ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. తొలుత గత నెల 13వ తేదీన మాల్దీవులకు వెళ్లారు. అక్కడ కూడా వ్యతిరేకత రావడంతో సింగపూర్ కు వెళ్లారు.
షరతులతో అనుమతి...
సింగపూర్ లోనూ గొటబాయ రాజపక్స్ వీసా గడువు ముగిసింది. దీంతో ఆయన థాయ్లాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే థాయ్ లాండ్ ప్రభుత్వం తాత్కాలికంగా ఉండేందుకు అనుమతిచ్ింది. ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను నిర్వహించకూడదని షరతు విధించింది. దీంతో ప్రస్తుతం ధాయ్ లాండ్ కు గొటబాయ రాజపక్సే బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story