Sun Dec 22 2024 22:15:16 GMT+0000 (Coordinated Universal Time)
వీడు భర్తా ? భార్య శరీరాన్ని 92 మందికి అప్పగించి.. వీడియోలు తీసి
తన భర్తకు తనపై ఎంతో ప్రేమ ఉందనుకున్న ఆమె..మురిసిపోయేది. అన్నం తినగానే స్పృహ లేకుండా నిద్రపోయేది. ఉదయానికి
తనను నమ్మి, తానే సర్వస్వమని వచ్చిన భార్యను.. ఓ భర్త నిలువునా మోసం చేశాడు. భార్యను కాపాడుకుంటూ, అండగా నిలవాల్సిన అతను ఉన్మాదిలా ప్రవర్తించాడు. పరాయి పురుషుల కోరికలు తీర్చే వస్తువుగా ఆమెను మార్చాడు. మత్తు మందు ఇచ్చి.. పరాయి పురుషులను ఇంటికి ఆహ్వానించి, ఆమె శరీరాన్ని వారికి అప్పగించేవాడు. 2011 నుండి 2020 వరకూ ఆమెపై 92 మంది అత్యాచారం చేశారు. ఈ తతంగాన్నంతా భర్త డొమినిక్ వీడియో తీసి యూఎస్ బీ డ్రైవ్ లో స్టోర్ చేసేవాడు. ఈ దారుణ ఘటన ఫ్రాన్స్ లోని మజాన్ లో చోటు చేసుకుంది. టెలీగ్రాఫ్ కథనం మేరకు.. డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు ప్రతి రోజూ రాత్రి లోరజపామ్ అనే సెడేటివ్ మందును అన్నంలో కలిపి తినిపించేవాడు.
తన భర్తకు తనపై ఎంతో ప్రేమ ఉందనుకున్న ఆమె..మురిసిపోయేది. అన్నం తినగానే స్పృహ లేకుండా నిద్రపోయేది. ఉదయానికి ఆ విషయమే గుర్తుండేది కాదు. అదే సమయంలో డొమినిక్ పరాయి పురుషులను తన ఇంటికి ఆహ్వానించి భార్యను అప్పగించే వాడు. 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసు వారు ఇందులో పాల్గొన్నారు. స్మోకింగ్ చేసేవారిని, పెర్ ఫ్యూమ్ కొట్టుకుని వచ్చేవారిని డొమినిక్ రానిచ్చేవాడు కాదు. కారణం.. ఆ వాసనకు తన భార్యకు స్పృహ వస్తుందని జాగ్రత్తపడేవాడు. అలాగే ఇంటికి దూరంగా వాహనాలు పార్క్ చేయాలని చెప్పేవాడు. తన భార్య వంటిపై చేతులు వేస్తే స్పర్శ తెలియకుండా వేడి నీళ్లతో చేతులు కడుక్కుని వెళ్లాలని అతిథులను కోరేవాడని పోలీసులు తెలిపారు.
ఇలా భార్యపై పరాయి పురుషులు అత్యాచారం చేస్తున్న తతంగాన్ని డొమినిక్ వీడియో తీసి యూఎస్ బీ డ్రైవ్ లో స్టోర్ చేసే వాడు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2011 నుంచి 2020 మధ్య బాధితురాలిపై 92 సార్లు అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. 51 మందిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. డొమినిక్ సదరు మహిళకు ముగ్గురు పిల్లలు కూడా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తనపై భర్త చేసిన దుర్మార్గపు విషయం తెలిసి ఆ భార్య షాకు గురైంది. ఇలాంటి భర్తను నమ్మినందుకు..సిగ్గుగా ఉందని తెలిపింది. ఇప్పుడీ వార్త విన్నవారంతా.. ఆ ఉన్మాది భర్తను ఒక్కసారిగా ఉరి తీయకుండా.. చిత్రహింసలకు గురిచేసి, కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story