Mon Dec 23 2024 07:04:31 GMT+0000 (Coordinated Universal Time)
800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా.. వెల్లడించిన ఐక్యరాజ్యసమితి
15 ఏళ్ల తర్వాత జనాభా పెరుగుదల మందగించి.. 2080 వరకు 1000 కోట్లకు కూడా చేరుకునే అవకాశం లేనట్లు అంచనా. వైద్యం, పోషణ..
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనున్నట్లు తాజా నివేదిక చెబుతోంది. ఐరాస-2022 జనాభా అంచనాలపై ఒక నివేదిక వెల్లడించింది. ఐరాస నివేదిక ప్రకారం.. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత అంచనా ప్రకారం దేశ జనాభా 141.2 కోట్ల జనాభా ఉంది. 2050 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. మరో 15 ఏళ్లలో ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకుంటుంది.
15 ఏళ్ల తర్వాత జనాభా పెరుగుదల మందగించి.. 2080 వరకు 1000 కోట్లకు కూడా చేరుకునే అవకాశం లేనట్లు అంచనా. వైద్యం, పోషణ, వ్యక్తిగత శుభ్రత సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది కానీ.. సంతానోత్పత్తి మాత్రం తగ్గుతూ వస్తోంది. ప్రపంచ జనాభాలో సగం జనాభా చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్ దేశాల్లోనే ఉంది. కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. కొన్ని సంవత్సరాల వరకూ.. జనాభా పెరుగుదల కారణంగా ప్రపంచంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, విద్య, వైద్య సేవలతో పాటు ఉపాధి కూడా తగ్గి క్లిష్ట పరిస్థితులు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.
Next Story