Mon Dec 23 2024 14:20:51 GMT+0000 (Coordinated Universal Time)
యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త
తమ దేశ వీసాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో..
అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకుని.. ఉన్నతంగా స్థిరపడాలని చాలా మంది విద్యార్థులు భావిస్తారు. అలాంటి విద్యార్థులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. తమ దేశ వీసాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. వలసేతర వీసా కేటగిరీల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరో ఏడాదిపాటు వీసా వ్యక్తిగత వీసా ఇంటర్వ్యూను పొడిగించింది. 2023 డిసెంబరు 31 వరకూ మినహాయింపు కొనసాగనుంది. ఇంటర్వ్యూ మినహాయింపుతో వీసా నిరీక్షణ సమయం బాగా తగ్గనుంది.
అమెరికా తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో భారత విద్యార్థులు, వృత్తి నిపుణులకు లబ్ధి చేకూరనుంది. ఇంటర్య్యూ మినహాయింపునకు 'నిర్దిష్ట వలసేతర' అంటూ అమెరికా వర్గీకరించిన వీసా కేటగిరీల్లో విద్యార్థులు, వృత్తి నిపుణులు, కార్మికులు కూడా ఉన్నారు. ప్రత్యేక విద్య సందర్శకులు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ అయ్యేవారికి కూడా ఈ లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం వీసా ఉండి.. నాలుగేళ్లలోగా పునరుద్ధరణకు వెళ్లాలని భావించేవారికీ కూడా ఇంటర్వ్యూ మినహాయింపు వర్తించనుంది. ఈ మినహాయింపుతో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
Next Story