Tue Nov 05 2024 12:38:45 GMT+0000 (Coordinated Universal Time)
డొనాల్డ్ ట్రంప్ కు గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ ప్లే స్టోర్
పాపం డొనాల్డ్ ట్రంప్.. ఏది పడితే అది మాట్లాడి.. సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఎంతో గందరగోళానికి కారణమయ్యాడు. అందుకే పలు సోషల్ మీడియా దిగ్గజాలు.. డొనాల్డ్ ట్రంప్ ను బాయ్ కాట్ చేశాయి. దీంతో అదే సోషల్ మీడియా దిగ్గజాలను ఎదుర్కోడానికి ట్రంప్ కొత్తగా సొంతంగా సోషల్ మీడియా సైట్ ను తీసుకుని రావడానికి ప్రయత్నాలను మొదలుపెట్టాడు. అనుకున్నట్లుగానే తీసుకుని వచ్చాడు.
ఆల్ఫాబెట్ ఇంక్ కు చెందిన గూగుల్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా యాప్ 'ట్రూత్ సోషల్'ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచడానికి ఆమోదించినట్లు కంపెనీ ప్రతినిధి బుధవారం తెలిపారు. ట్రూత్ సోషల్ను నిర్వహిస్తున్న ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ (TMTG), త్వరలో ప్లే స్టోర్‌లో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది. దీనిపై TMTG ఇంకా స్పందించలేదు.
ఫిబ్రవరిలో ఆపిల్ యాప్ స్టోర్‌లో ట్రూత్ సోషల్ కనిపించింది. అయితే తగినంత కంటెంట్ మోడరేషన్ లేకపోవడం వల్ల ప్లే స్టోర్‌లో గతంలో అందుబాటులో లేదని గూగుల్ ప్రతినిధి ఆగస్టులో తెలిపారు. బెదిరింపులు, హింసను ప్రేరేపించడం వంటి కంటెంట్‌ను నిషేధించే ప్లే స్టోర్ విధానాల ఉల్లంఘనల గురించి Google Truth Social విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. Google, Apple స్టోర్లు లేకుండా, చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ట్రూత్ సోషల్ డౌన్లోడ్ చేయడానికి సులభమైన మార్గం లేదు. యునైటెడ్ స్టేట్స్‌లోని ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులు యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే ప్రధాన మార్గం గూగుల్ ప్లే స్టోర్. Android వినియోగదారులు ఇతర సైట్స్ ద్వారా యాప్‌లను పొందవచ్చు.. వెబ్సైట్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అయితే దీనికి తరచుగా అప్డేట్స్, భద్రతా అనుమతులు అవసరం. Google Play Store నుండి బ్లాక్ చేసినప్పటికీ Truth Social ఆయా మార్గాల ద్వారా అందుబాటులో ఉంది.
Next Story