Mon Dec 23 2024 08:30:38 GMT+0000 (Coordinated Universal Time)
12 వేల మందికి గూగుల్ గుడ్ బై
గూగుల్ సంస్థ కూడా తన ఉద్యోగులను తొలగించింది. దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది
కరోనా తర్వాత అనేక కంపెనీల యాజమాన్యం తమ ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టాయి. అమెజాన్, మైక్రోసాప్ట్ వంటి కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ కూడా తన ఉద్యోగులను తొలగించింది. దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది.
ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు...
ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఇప్పటికే ఈ మెయిల్ ద్వారా కొందరి ఉద్యోగులకు సమాచారం పంపింది గూగుల్ యాజమాన్యం. ఇంకొందరికి నేరుగా చెప్పడం ద్వారా తొలగించింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. తొలగించే ఉద్యోగులకు అరవై రోజుల నోటీసు ఇవ్వనున్నారు. ఏడాదికి రెండు వారాలు, 16 వారాల వేతనాన్ని ప్యాకేజీగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.
Next Story