Mon Dec 23 2024 05:46:27 GMT+0000 (Coordinated Universal Time)
Trump: షూటర్ ఉన్నాడని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు: ప్రత్యక్ష సాక్షి
తిరుగుతూ ఉన్నాడని చెప్పినా కూడా పట్టించుకోలేదని.. కాసేపటికి తమకు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని చూసినట్లు ప్రత్యక్ష సాక్షి బీబీసీకి తెలిపారు. ర్యాలీకి సమీపంలోని బిల్డింగ్ మీద ఓ వ్యక్తి రైఫిల్‌తో ఉన్నాడని అధికారులకు చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని తెలిపారు. సిబ్బంది వెంటనే ట్రంప్ ను అప్రమత్తం చేసి ఉంటే బాగుండేదన్నారు. ఓ వ్యక్తి ఇంటి పైన రైఫిల్ పట్టుకుని తిరుగుతూ ఉన్నాడని చెప్పినా కూడా పట్టించుకోలేదని.. కాసేపటికి తమకు కాల్పుల శబ్దం వినిపించిందన్నారు. అనుమానితుడు " ఓ పైకప్పు నుండి మరో పైకప్పుకు వెళ్లడం" చూశానని.. "పైకప్పు మీద ఉన్నాడు" అని ఒక అధికారికి కూడా చెప్పానన్నారు.
డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిపిన అనుమానిత సాయుధుడిని సీక్రెట్ సర్వీస్ స్నైపర్ కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ర్యాలీకి హాజరైన ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. సీక్రెట్ సర్వీస్ కౌంటర్-అసాల్ట్ టీమ్‌లోని సభ్యుడు నిందితుడిని కాల్చి చంపారు. ముష్కరుడు ర్యాలీకి 200 నుండి 300 అడుగుల దూరంలో ఎత్తైన నిర్మాణంపై నిలబడి ఉన్నాడు, రెండు వర్గాలు తెలిపాయి. షూటర్ AR తరహా రైఫిల్ ఆయుధాలు కలిగి ఉన్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారులు ఈ కాల్పులను హత్యాయత్నంగా పరిశోధిస్తున్నారు. సీక్రెట్ సర్వీస్, స్థానిక ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Next Story