Sat Nov 23 2024 09:00:04 GMT+0000 (Coordinated Universal Time)
వంట నూనెల ఎగుమతులను నిషేధించిన ఇండోనేషియా.. ఆ రియాక్షన్ మన మీదే ఎక్కువట
ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ వ్యాపారం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది. రాబోయే రోజుల్లో..
న్యూఢిల్లీ : వంట నూనెల ఎగుమతులను ఇండోనేషియా నిషేధించడంతో ఆ రియాక్షన్ ప్రపంచ దేశాలపై పడింది. ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు కూడా ఇక ధరలను పెంచేలా చేస్తోంది. వంట నూనెల ఎగుమతులను ఇండోనేషియా నిషేధించడంతో పలు సంస్థలకు పెద్ద ఎత్తున ఖర్చు అవ్వబోతోంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం గురించి ఆందోళనలను పెంచుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద వంట నూనెల రవాణాదారు ఇండోనేషియా.. దేశీయ కొరత కారణంగానూ, ఆ దేశ ప్రజల నుండి ఎదురైన నిరసనల కారణంగా ఏప్రిల్ 28 నుండి కొన్ని వంట నూనెల ఎగుమతులను నిలిపివేస్తుంది. ఈ నిర్ణయం కూరగాయల నూనెల సరఫరాలను తగ్గిస్తుంది.
ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ వ్యాపారం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది. రాబోయే రోజుల్లో మరింత గందరగోళంలోకి నెట్టబోతోంది. ఇండోనేషియా నిషేధం కొన్ని ఉత్పత్తులను మినహాయించవచ్చని వార్తలు వెలువడుతున్నప్పటికీ, ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆహార ఖర్చులు ఆల్ టైమ్ హై గా ఉన్నాయి. ఇప్పటికే ధరలు ఎంతో వేగంగా పెరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఆయిల్ కొరత కారణంగా ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
పామ్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలను ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం ఉంది. ఇక ద్రవ్యోల్బణంలో మరింత పెరుగుదలను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి చివరలో ఉక్రెయిన్లో యుద్ధం చెలరేగినప్పటి నుండి న్యూఢిల్లీలో వంటనూనెల దేశీయ ధరలు 12% - 17% మధ్య పెరిగాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలను రద్దు చేసింది. వంట నూనెల నిల్వలను అరికట్టడానికి ప్రయత్నిస్తోంది, అయితే ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండోనేషియా ఈ చర్య అనేక కంపెనీల ఖర్చులు, మార్జిన్లను దెబ్బతీస్తుందని నిపుణులు తెలిపారు. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, ITC లిమిటెడ్లు ప్రత్యక్షంగా ప్రభావితమైన వాటిలో ఉన్నాయి. దీని ప్రభావం బిస్కెట్లు, నూడుల్స్, కేకులు, బంగాళాదుంప చిప్స్, ఫ్రోజెన్ డెజర్ట్లపై చాలా తీవ్రంగా ఉంటుంది.
Next Story