Fri Nov 22 2024 20:54:08 GMT+0000 (Coordinated Universal Time)
GSLV F14 : నేడు జీఎస్ఎల్వీ ప్రయోగం
ఇన్శాట్ 3ని మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎఫ్ 14 రాకెట్ ను నేడు నింగిలోకి దూసుకెళ్లనుంది
GSLV F14 :శ్రీహరికోటలో నేడు జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం జరగనుంది. ఇన్శాట్ 3ని మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎఫ్ 14 రాకెట్ ను నేడు నింగిలోకి దూసుకెళ్లనుంది. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేయనున్నారు. సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం జరగనుంది.
కౌంట్ డౌన్ ప్రారంభమయి....
నిన్ననే దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఇది 2,275 కిలోల బరువైన ఇన్శాట్ 3 డీఎస్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. వాతావరణ పరిస్థితులతో పాటు, ప్రకృతి విపత్తుల హెచ్చరికల కోసం కూడా ఇది ఉపయోగపడనుంది. నిన్న ప్రారంభమైన కౌంట్ డౌన్ తో శాస్త్రవేత్తలు నేడు రాకెట్ ను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు.
Next Story