Fri Nov 22 2024 23:07:16 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన శునకం ఇదీ..
గున్థర్ జీవితంపై.. గున్థర్ మిలియన్స్ అనే డాక్యుమెంటరీ విడుదల కాబోతోంది. ఈ డాక్యుమెంటరీలో ఈ కుక్కకు ఉన్న ఆస్థి..
వారసత్వంగా వచ్చిన ఆస్థితో, రెక్కల కష్టంతో, అదృష్టం కలిసొచ్చో.. మనుషులు కోటీశ్వరులవ్వడం విని ఉంటారు. అంతెందుకు.. ఏ లాటరీనో తగిలి కోటీశ్వరులైనవారున్నారు. కానీ ఇక్కడ ఓ కుక్క రూ.655 కోట్ల ఆస్తికి వారసురాలు. నమ్మబుద్ధి కావట్లేదు కదూ. కానీ నమ్మాల్సిందే. దానిపై ఓ డైరెక్టర్ ఇటీవల డాక్యుమెంటరీ కూడా తీశాడు. త్వరలోనే అది నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఆ కుక్క ఇటలీలోని పాప్ స్టార్ మడోన్నా మాజీ ఇంట్లో నివసిస్తోంది. దానిపేరు గున్థర్ VI. ఇప్పుడు దానికి కార్లు, బంగ్లాలు, సంపద, పనిమనుషులున్నారు.
డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. గున్థర్ జీవితంపై.. గున్థర్ మిలియన్స్ అనే డాక్యుమెంటరీ విడుదల కాబోతోంది. ఈ డాక్యుమెంటరీలో ఈ కుక్కకు ఉన్న ఆస్థి, దానిని ఎలా సంపాదించిదన్న వివరాలను తెలియజేశారు. ఇక ఈ కుక్క జీవితంపై డాక్యుమెంటరీ తీసిన దర్శకుడు అరేలియన్ లెటర్జీ.. దాని కథ విని షాకైనట్లు తెలిపారు. ఈ కుక్క ఇంత ధనవంతురాలిగా, విపరీతమైన జీవనశైలిని ఎలా గడుపుతుందో విని అంతా షాకవుతున్నారు. జర్మన్ కౌంటెస్ కార్లోటా లైబెన్ స్టెయిన్ నుండి.. గున్థర్ ఈ ఆస్తిని వారసత్వంగా పొందింది. లీబెన్ స్టెయిన్ కుమారుడైన గుంథర్ ఆత్మహత్య చేసుకోవడంతో.. లైబెన్ స్టేయిన్ 1992లో చనిపోయే ముందు ఒక ట్రస్ట్ ను సృష్టించి, తనకెంతో ఇష్టమైన కుక్క పేరిట 6.5 బిలియన్ రూపాయల విలువైన ఆస్తిని రాశాడు. ఈ కుక్క ఓ ఇటాలియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి యజమాని కూడానట.
Next Story