Mon Dec 23 2024 07:39:59 GMT+0000 (Coordinated Universal Time)
Israel Strikes : హమాస్ - ఇజ్రాయిల్ వార్... 356 మంది మృతి
హమాస్ - ఇజ్రాయిల్ పోరు లెబనాన్ వైపునకు మళ్లింది. ఇప్పటి వరకూ గాజాకు పరిమితమైనయుద్ధం లెబనాన్‌కు తాకింది
హమాస్ - ఇజ్రాయిల్ పోరు లెబనాన్ వైపునకు మళ్లింది. ఇప్పటి వరకూ గాజాకు పరిమితమైన ఈ యుద్ధం ఇప్పుడు లెబనాన్‌కు తాకడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. డ్రోన్లతో కురిపించిన బాంబుల వర్షంతో దాదాపు 356 మంది మరణించినట్లు తెలుస్తోంది. వెయ్యికి మందికి పైగానే గాయపడ్డారు. సైదా, మరజుయాన్, టైర్, జహరానితో బెకా లోని అనేక జిల్లాలపై యుద్ధవిమానాలు విరుచుకుపడ్డాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.ఈ యుద్ధం కారణంగా దక్షిణ లెబనాన్‌కు చెందిన అనేక గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
బీరుట్ వైపునకు...
గ్రామ ప్రజలు భయపడిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వారు వాహనాల్లో బీరుట్ వైపు వెళ్లిపోవడం కనిపించిందని చెబుతున్నారు. దీంతో బీరుట్ కు వెళ్లే మార్గం అంతా ట్రాఫిక్ తో స్థంభించిపోయింది. హెజబుల్లాకు చెందిన 1300 టార్గెట్లను తాము ఢీకొట్టామని ఇజ్రాయిల్ అధికారికంగా ప్రకటించింది. హెజబుల్లా క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా ఈ దాడులుజరిగాయి. హమాస్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న పోరులో ఇదే అతి పెద్ద యుద్ధంగా చెబుతున్నారు.
ఇరు దేశాల మధ్య...
ఇరు దేశాల మధ్య భీకర పోరు నడుస్తుండటంతో సామాన్య ప్రజలు చితికి పోతున్నారు. లెబనాన్ పై తమ దాడులు ఆగబోవని, కొనసాగుతాయని ఇజ్రాయిల్ ప్రకటించింది. హెజ్బొల్లా ఆయుధాలను దాచిన ప్రదేశాలను ధ్వసం చేయడమే లక్ష్యంగా తమ క్షిపణులు వెళ్తాయని కూడా ప్రకటించింది. ప్రజలు తమ నివాసాలు వదిల వెళ్లిపోవడం మంచిదని కూడా ప్రకటించింది. అయితే లెబనాన్ పౌరులుదీనిపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియల్ హగారి కోరారు. ఇజ్రాయిల్ వార్నింగ్‌లను లెబనాన్ పౌరులు సీరియస్ గా తీసుకోవాలని మరోవైు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునివ్వడంతో యుద్ధం భీకరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story