CVV నంబర్ అంటే ఏమిటి? ఇక ఈ నంబర్ లేకుండా క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్ లావాదేవీలు
డెబిర్డ్, క్రెడిట్ కార్డ్‌తో ఆన్లైన్ లావాదేవీలు చేయడం మరింత సులభతరం అయిపోతుంది. కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV)..
బిర్డ్, క్రెడిట్ కార్డ్‌తో ఆన్లైన్ లావాదేవీలు చేయడం మరింత సులభతరం అయిపోతుంది. కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV) సమాచారాన్ని అందించాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు ఆన్లైన్ లావాదేవీలు చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఇంతకుముందు కూడా కార్డ్ క్లోనింగ్ జరిగింది. అందుకే మోసపోతామనే భయం ఉండేది. ఇప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డులతో లావాదేవీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని మార్చేందుకు నిర్ణయించాయి. అందుకోసం టోకనైజేషన్ పద్ధతిని అమలు చేశారు. చెక్అవుట్ని వేగవంతం చేయడానికి మాస్టర్‌కార్డ్ కొత్త సేవను కూడా ప్రారంభించింది. మాస్టర్ కార్డ్ వినియోగదారులకు వ్యాపారి ప్లాట్‌ఫారమ్‌లో టోకనైజ్ ఆప్షన్‌ను అందిస్తుంది. దీని కోసం ఇప్పుడు వినియోగదారులు CVV నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు.
జోమాటో వంటి భారతీయ కంపెనీలు నగదు రహిత చెల్లింపుల కోసం సీవీవీ నంబర్ లేకుండా ఆన్లైన్ లావాదేవీలను ఇప్పటికే ప్రారంభించాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో వీసా వంటి కంపెనీలు కూడా సీవీవీ ఉచిత ప్రచారం ప్రయోజనాన్ని వినియోగదారులకు విస్తరించేలా చేశాయి. రూపే డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డ్ హోల్డర్ల కోసం ఉచిత సీవీవీ సర్వీస్‌ను కూడా ప్రారంభించింది.
CVV నంబర్ అంటే ఏమిటి?
CVV అనేది డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వెనుక ఉన్న మూడు అంకెల సంఖ్య. దీనినే సీవీవీ నంబర్ అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోకనైజేషన్ ఎంపికతో ముందుకు వచ్చింది. దీని ప్రకారం.. ఇకపై కస్టమర్లు తమ కార్డు వివరాలు, చిరునామా ఇవ్వాల్సిన అవసరం లేదు.
టోకనైజేషన్ అంటే ఏమిటి?
టోకనైజేషన్ అంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ప్రాథమిక సమాచారాన్ని కోడ్‌గా మార్చడం. కోడ్‌నే టోకెన్ అంటారు. ఈ టోకెన్ కోడ్ వివరణను కలిగి ఉంది. ఈ సమాచారం డెబిట్-క్రెడిట్ కార్డ్ కంపెనీలకు పంపిస్తారు. ఈ కంపెనీలు ఈ సమాచారాన్ని కోడ్‌గా మారుస్తాయి. ఈ ప్రక్రియ కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. అందువల్ల కస్టమర్ ప్రాసెస్‌లో ఎలాంటి జాప్యాన్ని ఎదుర్కొడు. అయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఏదైనా ఇ-కామర్స్ వ్యాపారి వెబ్సైట్ లేదా యాప్‌ని సందర్శించండి. ఇక్కడ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించి, మీ కార్డ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. చెక్ అవుట్ చేస్తున్నప్పుడు ఇప్పటికే సేవ్ చేసిన డెబిట్-క్రెడిట్ కార్డ్ వివరాలు, ఇతర వివరాలను నమోదు చేయండి.
ఆపై 'ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం.. మీ కార్డ్‌ని సురక్షితం చేయండి' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేదా ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం మీ కార్డ్‌ని టోకనైజ్ చేయండి. తర్వాత టోకనైజ్ చేయడానికి అంగీకరించండి. ఇక OTP మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేయండి. ఈ ప్రాసెస్ ద్వారా లావాదేవీని పూర్తి చేస్తారు. ఆపై టోకెన్‌ని రూపొందించండి. టోకెన్ జనరేట్ అవుతుంది. ఇది కూడా సురక్షితగానే ఉంటుంది. మీరు అందించిన వివరాలు టోకెన్లుగా మార్చబడతాయి. అప్పుడు మీరు సంబంధిత వెబ్‌సైట్‌కి వెళ్లినప్పుడు మీ కార్డ్ చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఇది టోకనైజేషన్.
కార్డుతో ఎన్ని లావాదేవీలు?
భారతదేశంలో ఆన్లైన్ లావాదేవీలలో డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మే 31, 2022 నాటికి దాదాపు 92 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయినట్లు ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. మార్చి 2023 నాటికి క్రెడిట్ కార్డ్‌ల ద్వారా ఇ-కామర్స్‌పై 63% కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం.