Mon Dec 23 2024 11:12:43 GMT+0000 (Coordinated Universal Time)
America : లక్ అంటే అతగాడిదే కదా.. 166 రూపాయలతో 13,339 కోట్ల లాటరీ
అదృష్టం అంటే అతడిదే.. అమెరికాలో 166 రూపాయలు పెట్టి టిక్కెట్ కొంటే 13,339 కోట్లు లాటరీ తగిలింది
అదృష్టం ఎవరి తలుపు తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం. లక్ అనేది వెన్నంటే ఉంటుంది. అదృష్టం వెంట పడిందంటే అసలు వదల్దు అంటారు అనేక మంది. అన్నీ గుడ్ న్యూస్లే. అందుకే లక్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. కొందరికి ఒక్కో రకంగా అదృష్టం వరిస్తుంటుంది. అందరినీ కాదు లెండి. ఎవరినో ఒకరినో.. వందలో.. వేలల్లో కొందరికే కాదు.. కాదు.. ఒక్కరికే అదృష్టం పడుతుంది. అది పట్టిందంటే చాలు అప్పటి వరకూ అంటిపెట్టుకున్న సమస్యలన్నీ వదిలిపోయినట్లే.
మెగా మిలియన్ లాటరీ...
సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. లాటరీ తగిలితే పది కోట్లు.. ఇరవై కోట్లు వచ్చాయని వింటాం. కానీ అమెరికాలో అతి పెద్ద మొత్తంలో లాటీర మొత్తాన్ని గెలుచుకుని అందరి నోళ్లలో నానుతున్నాడు ఆయన. అమెరికాలోని ఫ్లారిడాలో ఒక వ్యక్తి 166 రూపాయలు పెట్టి ఒక లాటరీ టిక్కెట్ ను కొనుగోలు చేశాడు. అయితే అతగాడికే ఈ లాటీరీ తగిలింది. ఎంతో తెలుసా.. మీరు నమ్మినా.. నమ్మకపోయినా... నిజం.. 13,339 కోట్ల రూపాయలు. అంటే తరతరాలుగా ఆ కుటుంబం మొత్తం ఈ ఒక్క లాటరీ టిక్కెట్ తో సెటిల్ అయిపోయినట్లే.
అతి పెద్ద మొత్తం...
అమెరికా డాలర్లలో ఈ మొత్తం 160 కోట్ల డాలర్ల ప్రైజ్మనీని గెలుచుకున్నాడు. సాల్డయిన్ హోల్డింగ్స్ యజమాని ఈ లాటరీ టిక్కెట్ ను గెలుచుకున్నట్లు ప్రకటించారు. భద్రత పరమైన కారణాల దృష్ట్యా మూడు నెలల తర్వాత ఫలితాన్ని ప్రకటించారు. విజేత పేరును కూడా రివీల్ చేశారు. అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద లాటరీ మొత్తంగా చెబుతున్నారు. మెగా మిలియన్ లాటరీని గెలుచుకున్న ఆయన ఫొటో మాత్రం భద్రతపరమైన కారణాల చేత బయటకు విడుదల చేయలేదు. మొత్తం మీద 13,339 కోట్లు గెలుచుకున్న ఆ వ్యక్తి అదృష్టాన్ని ఏమని వర్ణించగలమూ.. అంటూ అమెరికన్లు తెగపాడేసుకుంటున్నారు.
Next Story