Mon Dec 23 2024 05:48:09 GMT+0000 (Coordinated Universal Time)
కాలిఫోర్నియాలో భారీ భూకంపం..24 గంటల్లో 40సార్లు ప్రకంపనలు
2010 తర్వాత ఇంతవరకూ ఇంత భారీ భూకంపాన్ని చూడలేదని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. కాగా.. భూకంపం కారణంగా సంభవించిన నష్టాన్ని హంబోల్ట్ కౌంటీ అధికారులు
భారీ భూకంపంతో కాలిఫోర్నియా ఉలిక్కిపడింది. ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక యూఎస్ జియోలాజికల్ సర్వే డేటా ప్రకారం ఉత్తర కాలిఫోర్నియా తీరంలో 6.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. హంబోల్ట్ కౌంటీకి సమీపంలో ఉన్న కేప్ మెండోసినో సమీపంలో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. హంబోల్ట్ కౌంటీలోని కాలిఫోర్నియా లాస్ట్ కోస్ట్ ప్రాంతంలోని పెట్రోలియా పట్టణానికి పశ్చిమాన 24 మైళ్ళు (39 కిమీ) దూరంలోని పసిఫిక్ మహాసముద్రంలో (యూరేకా తీరం) 9 కిమీ (5.6 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.10 గంటలకు 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు హంబోల్ట్ కౌంటీ షెరీఫ్ విభాగం తెలిపింది.
ఈ ప్రకంపనల ప్రభావం శాన్ ఫ్రాన్సిస్కో తో పాటు కాలిఫోర్నియాలోని చికో వరకు కనిపించింది తెలిపింది. కాగా.. 2010 తర్వాత ఇంతవరకూ ఇంత భారీ భూకంపాన్ని చూడలేదని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. కాగా.. భూకంపం కారణంగా సంభవించిన నష్టాన్ని హంబోల్ట్ కౌంటీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా ? లేదా ప్రాణ నష్టం జరిగిందా ? ఆస్తి నష్టం ఎంత ? తదితర వివరాలేమీ తెలియరాలేదు. చాలా ప్రాంతాల్లో పగిలిన అద్దాలు, కిందపడి వస్తువులు పగిలిన ఘటనలు కనిపించాయి. ఇదిలా ఉండగా వాయువ్య యూఎస్ లో 24 గంటల్లో 40 కన్నా ఎక్కువ భూకంపాలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.
ఈ భూకంపం అనంతరం సునామీ రావొచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ.. అనేక ప్రకంపనలతో సునామీ వచ్చే సూచనలు లేవని తెలిపారు. కాగా.. ఇటీవలే ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. సముద్ర గర్భంలో సుమారు 9.2 తీవ్రతతో భూకంపం రావడంతో.. మళ్లీ ప్రపంచంలోని పలు తీరప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు కూడా వచ్చాయి.
Next Story