Mon Dec 23 2024 15:24:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రెజిల్ లో కుండపోత వర్షం.. 14 మంది మృతి
గడిచిన 48 గంటల్లో 655 మిల్లీమీటర్లు (26 అంగుళాలు) వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మున్సిపాలిటీలో..
బ్రెజిల్ దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల కారణంగా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రియో డి జనీరో రాష్ట్రంలో కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులున్నట్లు సమాచారం. నగరంలోని మునిసిపల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అంగ్రా డోస్ రీస్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
గడిచిన 48 గంటల్లో 655 మిల్లీమీటర్లు (26 అంగుళాలు) వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూలేని విధంగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా నగరంలో ఆరుగురు మరణించినట్లు అధికారులు గుర్తించారు. కొండచరియలు విరిగినపడిన పారాటీ పట్టణంలో ఏడుగురు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. 71 కుటుంబాలు నిరాశ్రయులయినట్లు అధికారులు వెల్లడించారు. అంగ్రా డాస్ రీస్ నగరంలో భారీ వర్షాలకారణంగా తొమ్మిది మంది వరదల్లో చిక్కుకుని తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. పారాటీలో ఒక్కరోజులోనే 332 మిమీ వర్షపాతం నమోదైంది.
Next Story