Sat Nov 23 2024 02:11:55 GMT+0000 (Coordinated Universal Time)
బిపోర్జాయ్ ఎఫెక్ట్ : 25 మంది మృతి
వాయువ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు కూలిపోవడంతో సుమారు 25 మంది మరణించారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను వేగంగా కదులుతూ గుజరాత్, పాక్ తీరాలవైపు దూసుకెళ్తోందు. తీవ్రతుపానుగా రూపాంతరం చెందిన తుపాను ప్రభావంతో సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ముంబై, గుజరాత్ తీరాల్లో రాకాసి అలలు తీరాన్ని తాకుతున్నాయి. గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ట్రాన్ని పలు తీరప్రాంతాల్లో తుపాను ప్రభావం కనిపిస్తోంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు పాకిస్తాన్ పై బిపోర్జాయ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. వాయువ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు కూలిపోవడంతో సుమారు 25 మంది మరణించారు. మరో 145 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్సులోని బన్నూ, లక్కీమార్వాట్, కరక్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా చెట్లు, ఎలక్ట్రికల్ ట్రాన్స్ మీటర్లు, టవర్లు నేలకూలాయి. కాగా.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం 1.3 బిలియన్ డాలర్లను కేటాయించింది. శుక్రవారం సమర్పించిన జాతీయ బడ్జెట్ ముసాయిదాలో ఈ మొత్తాన్ని కేటాయించింది. ‘బిపార్ జోయ్’ తుఫాను ‘అత్యంత తీవ్ర తుఫాను’గా మారే అవకాశం ఉన్నందున, ముందస్తుగా అత్యవసర చర్యలు చేపట్టాలని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధికారులను ఆదేశించారు. తుపాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో (గంటకు 93 మైళ్ళు) దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నట్లు పాకిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Next Story