Mon Dec 23 2024 10:34:05 GMT+0000 (Coordinated Universal Time)
అందరూ చూస్తుండగానే.. బీచ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్
హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రాంతంలో పర్యాటకులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో..
సముద్ర తీరంలో ఉన్న పర్యాటకులంతా చూస్తుండగానే హెలికాఫ్టర్ బీచ్ లో కుప్పకూలిపోయింది. దాంతో అప్పటి వరకూ తీరంలో, బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులంతా ఒక్కసారిగా చెల్లా చెదురయ్యారు. ఈ ఘటన అమెరికాలోని మియామీ నగరంలో చోటుచేసుకుంది. హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రాంతంలో పర్యాటకులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో ముగ్గురు వ్యక్తులుండగా.. వారిలో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Also Read : సమంత "శాకుంతలం" అప్డేడ్.. 21న ఫస్ట్ లుక్
హెలికాఫ్టర్ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ బీచ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక కారణాలతోనే హెలికాఫ్టర్ కుప్పకూలినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. కుప్పకూలిన హెలికాప్టర్ రాబిన్సన్ R44గా గుర్తించారు. హెలికాప్టర్ కుప్పకూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
Next Story