Sun Nov 17 2024 23:50:49 GMT+0000 (Coordinated Universal Time)
నాన్నా జారుతున్నట్లుగా అనిపిస్తోందని చెప్పింది.. ఇంతలో
తండ్రి కళ్ల ముందరే ఓ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. 20 ఏళ్ల అరిజోనా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థిని
తండ్రి కళ్ల ముందరే ఓ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. 20 ఏళ్ల అరిజోనా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థిని గ్రేస్ రోహ్లాఫ్ కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లో తన తండ్రితో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ఉండగా పై నుండి కిందపడి మరణించింది. ప్రమాదానికి ముందు.. గ్రేస్ తన తండ్రితో "నాన్న, నా బూట్లు జారుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది" అని చెప్పింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఆమె హాఫ్ డోమ్ కొండపై నుంచి 200 అడుగుల కిందకు జారి పడిపోయింది. గ్రేస్ రోహ్లాఫ్, జోనాథన్ రోహ్లాఫ్, ఇద్దరు అనుభవజ్ఞులైన హైకర్లు.. జూలై 11న అకస్మాత్తుగా వర్షంలో చిక్కుకోగా చివరికి వారి ట్రెక్ విషాదాంతంగా మారింది.
జారిపోతున్నా అని కుమార్తె చెప్పినప్పుడు తండ్రి ఆమెను చేరుకోవడానికి ప్రయత్నించాడు కానీ చేరుకోలేకపోయాడు. ఘటన జరిగిన తర్వాత, తన కుమార్తెను రక్షించేందుకు తండ్రి 911కి కాల్ చేశాడు. తలకు తీవ్ర గాయాలైన గ్రేస్‌ను చేరుకోవడానికి రెస్క్యూ బృందాలకు మూడు గంటలు పట్టింది. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపు మరణించిందని అధికారులు ధృవీకరించారు. గ్రేస్, జోనాథన్ హాఫ్ డోమ్ హైక్‌ను పూర్తి చేయాలని భావించారు. అక్కడికి రోజుకు 300 మంది హైకర్లను మాత్రమే అనుమతిస్తారు. తుఫాను గురించి హెచ్చరించినప్పటికీ, వారు పైకి వెళ్లారు. అయితే వారు దిగడం ప్రారంభించగానే వర్షం తీవ్రమైంది. దిగుతుండగా, గ్రేస్ కొత్త హైకింగ్ బూట్లు జారడం ప్రారంభించాయి. జోనాథన్ నిస్సహాయంగా ఆమె పడిపోతుండగా చూస్తూ ఉండిపోయాడు. గ్రేస్‌ను కాపాడడానికి రెస్క్యూ హెలికాప్టర్ కూడా వచ్చింది. ఆమె కింద పడగానే ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అధికారులు తెలిపారు.
Next Story