Tue Dec 24 2024 01:06:11 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాను మళ్లీ వణికిస్తోన్న మంచు తుపాను.. 1500 విమానాలు రద్దు
మంచు తుపాను కారణంగా 1500కు పైగా విమానాలు రద్దయ్యాయి. వాటిలో 400కి పైగా మిన్నియాపాలిస్-సెయింట్ పాల్..
అమెరికాను మరోసారి మంచు తుపాను వణికిస్తోంది. ఉత్తరాది, పశ్చిమ మధ్య రాష్ట్రాల్లో భారీ హిమపాతం అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారీగా మంచు కురుస్తుండటంతో అరిజోనా నుంచి వ్యోమింగ్ వరకు అంతర్రాష్ట్ర రహదారులను మూసివేశారు. కాలిఫోర్నియాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలంతా చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
మంచు తుపాను కారణంగా 1500కు పైగా విమానాలు రద్దయ్యాయి. వాటిలో 400కి పైగా మిన్నియాపాలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నవే ఉన్నాయి. మరో 5000 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మిడ్ వెస్ట్, మిడ్-అట్లాంటిక్, ఆగ్నేయ ప్రాంతాల్లోని నగరాల్లో గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంచు తుపాను కారణంగా ఉత్తరాది ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. మంచు తుపాను ధాటికి మిన్నెసోటా శాసనసభను కూడా మూసివేశారు.
Next Story