Mon Mar 31 2025 04:14:07 GMT+0000 (Coordinated Universal Time)
ఇరాన్ లో భారీ భూకంపం : ఏడుగురి మృతి
ఇరాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.9 తీవ్రతగా నమోదయింది.

ఇరాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.9 తీవ్రతగా నమోదయింది. అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ నగరంలో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంప తీవ్రతకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం వల్ల ఏడుగురు మరణించగా, దాదాపు నాలుగు వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వందల మందికి గాయాలు...
భవనాలు కూలిపోవడంతో వాటికింద మరెంత మంది ఉంటారోనని శిధిలాలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. భవనాలు కూలుతుండగా చూసిన కొందరు పైనుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
- Tags
- earthquake
- iran
Next Story