Sat Nov 02 2024 19:41:38 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాను వణికిస్తున్న హరికేన్లు.. అత్యవసర పరిస్థితి ప్రకటన
అమెరికాను హరికేన్లు వణికిస్తున్నాయి. మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వైపు వేగంగా పయనిస్తుందని నిపుణులు చెబుతున్నారు
అమెరికాను హరికేన్లు వణికిస్తున్నాయి. మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వైపు వేగంగా పయనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హెలెనా హరికేన్ ఈరోజు మధ్యాహ్నానికి ఈశాన్య ప్రాంతంలోని తీరాన్ని తాకొచ్చని అంచనా వేస్తున్నారు. సహజంగా అమెరికాలో హరికేన్లు జూన్లో ప్రారంభమయి నవంబరు నెల వరకూ ఉంటాయి. ఈ నెలలో వీటి తీవ్రత అత్యధికంగా ఉంటుంది.
అతి వేగంగా గాలులు...
ఈ ఏడాది పదమూడు హరికేన్లు వస్తాయని ముందుగానే అంచనా వేశారు. హలెనా హరికేన్ తీవ్రతకు కాలిఫోర్నియా, జార్జియా, ఫ్లోరిడాలలో ఎమెర్జెన్సీని ప్రకటించారు. ప్రధానంగా 177 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని చెబుతున్నారు. సముద్రపు అలలు 20 అడుగులు ఎత్తున ఎగిసిపడతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అలెర్ట్ ప్రకటించారు. హెలెనా రాను రాను తీవ్రంగా మారుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story