Mon Dec 23 2024 06:30:10 GMT+0000 (Coordinated Universal Time)
లండన్ లో తెలుగు యువతి హత్య
అక్కడ తన స్నేహితులతో కలిసి ఉంటోంది. ఓ బ్రెజిల్ యువకుడు, మరో ఇద్దరు స్నేహితులు ఆమె రూమ్ మేట్స్.
హైదరాబాద్ కు చెందిన తేజస్విని రెడ్డి (27) అనే యువతి లండన్ లో హత్యకు గురైంది. తుర్కయాంజల్ లోని శ్రీరామ్ నగర్ కు చెందిన తేజస్విని రెడ్డి ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లింది. అక్కడ తన స్నేహితులతో కలిసి ఉంటోంది. ఓ బ్రెజిల్ యువకుడు, మరో ఇద్దరు స్నేహితులు ఆమె రూమ్ మేట్స్. ఈ క్రమంలో బ్రెజిల్ కు చెందిన యువకుడు తేజస్వినితో పాటు ఆమె స్నేహితురాలిపై కూడా దాడి చేశాడు.
ఈ ఘటనలో తేజస్విని చనిపోగా.. స్నేహితురాలైన అఖిలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా.. తేజస్విని రెండు నెలల క్రితమే ఎంఎస్ పూర్తి చేసింది. త్వరలోనే ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. ఇంతలోనే దారుణం జరిగిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు విపలిస్తున్నారు. నిందితుడైన యువకుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story