Sun Dec 22 2024 22:10:16 GMT+0000 (Coordinated Universal Time)
Trump Attacked: బుల్లెట్ నా చర్మాన్ని చీల్చినట్లు అనిపించింది: డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పెన్సిల్వేనియా, బట్లర్లో ర్యాలీలో ఒక సాయుధుడు కాల్పులు జరపడంతో
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పెన్సిల్వేనియా, బట్లర్లో ర్యాలీలో ఒక సాయుధుడు కాల్పులు జరపడంతో గాయాలు అయ్యాయి. నా కుడి చెవి పైభాగంలో బుల్లెట్ దూసుకుపోయిందని అన్నారు. గాయపడిన ట్రంప్ ఇప్పుడు క్షేమంగా ఉన్నారని సీక్రెట్ సర్వీస్ ధృవీకరించింది. ట్రంప్ బాగానే ఉన్నారని ఒక ప్రతినిధి పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో సాయుధుడు, ఒక ప్రేక్షకుడు మరణించగా.. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
"నా కుడి చెవి పైభాగానికి బుల్లెట్ తాకింది" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. తూటాలు దూసుకు వస్తుండగా.. ట్రంప్ తన కుడి చేతితో చెవిని పట్టుకున్నాడు, ఆపై పోడియం వెనుక మోకాళ్లపై కూర్చున్నాడు. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుమిగూడి ట్రంప్ ను కవర్ చేశారు. “నేను విజ్లింగ్ సౌండ్, షాట్లను విన్నాను. వెంటనే చర్మం గుండా బుల్లెట్ వెళ్లిందని అనిపించడంతో ఏదో తప్పు జరిగిందని నాకు అనిపించింది. చాలా రక్తస్రావం జరిగింది, ఏమి జరుగుతుందో నేను గ్రహించాను, ”అని ట్రంప్ అన్నారు. వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్, లా ఎన్ఫోర్స్మెంట్కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సంఘటనను రిపబ్లికన్లు, డెమొక్రాట్ లు ఖండించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ "అమెరికాలో ఈ రకమైన హింసకు చోటు లేదు. దానిని ఖండించడానికి మనం ఒక దేశంగా ఏకం కావాలి." అని అన్నారు.
Next Story