Mon Nov 04 2024 18:32:32 GMT+0000 (Coordinated Universal Time)
ఇజ్రాయెల్ - హమాస్ భారత్‌పై ప్రభావం
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తారా స్థాయికి చేరే అవకాశం ఉంది. అయితే ఈ రెండు దేశాల యుద్దం పశ్చిమాసియాలోని ఇతర ప్రాంతాలపై, ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాలపై ప్రభావం చూపుతుంది.
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తారా స్థాయికి చేరే అవకాశం ఉంది. అయితే ఈ రెండు దేశాల యుద్దం పశ్చిమాసియాలోని ఇతర ప్రాంతాలపై, ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాలపై ప్రభావం చూపుతుంది.దీని కారణంగా ఆ ప్రభావం కాస్త భారత్‌పై కూడా పడే అవకాశం ఉంది. ఇప్పుడు భారత్‌లోని టీ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ యుద్ధం భారతీయ తేయాకును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ఒకటైన ఇరాన్‌పై ప్రభావం చూపితే అది టీ పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు.
జనవరి-డిసెంబర్ 2022లో అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి 42.3 మిలియన్ కిలోల ఎగుమతులు, రష్యా 41.1 మిలియన్ కిలోలు, ఇరాన్ 21.6 మిలియన్ కిలోల ఎగుమతులు జరిగాయి. తేయాకు కూడా యూఏఈ ద్వారా ఇరాన్‌కు రవాణా చేయబడుతుంది. ఇది ప్రధాన రీ-ఎగుమతి కేంద్రంగా ఉంది. ఎగుమతిదారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, వారి ఆందోళన కూడా పెరుగుతోందని భారత టీ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అన్షుమన్ కనోడియా తెలిపారు.
హమాస్ దాడిలో ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దాడిలో ఇరాన్ ప్రమేయానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని ఇజ్రాయెల్ సైన్యం చెప్పినప్పటికీ, సంఘర్షణ తీవ్రతరం కావడంతో దేశంలోని టీ పరిశ్రమకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇరాన్ ప్రధానంగా సాంప్రదాయ టీ మార్కెట్. ఇక్కడ ఎగుమతులు ఎక్కువగా అస్సాం నుంచి జరుగుతాయి. అయితే ఈ రంగంలో దక్షిణ భారతదేశానికి కూడా వాటా ఉంది.
సౌత్ ఇండియా టీ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు దీపక్ షా మాట్లాడుతూ.. పరిశ్రమలో భయానక వాతావరణం నెలకొందన్నారు. ఎగుమతిదారులు వీలైనంత త్వరగా వస్తువులను రవాణా చేయాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కానీ చెల్లింపులపై అనిశ్చితి ఉంది. అలాగే వస్తువుల తరలింపులో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉందంటున్నారు. దక్షిణ భారతదేశం నుంచి సాంప్రదాయ సీటీసీ టీ దుబాయ్‌కి ఎగుమతి చేయబడుతుంది. అలాగే ఇక్కడ నుండి ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు తిరిగి ఎగుమతి చేయబడుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం కారణఃగా భారత్ పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో తేయాకు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Next Story