Fri Dec 20 2024 11:02:10 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికా వెళ్లాలంటే ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే
ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది
ప్రపంచ దేశాలన్నింటికీ మళ్లీ కరోనా గుబులు పట్టుకుంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంటే కేసులు క్రమంగా ఒక్కో దేశంలో బయటపడుతున్నాయి. ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదైతే మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగే సూచనలు ఎక్కువే ఉన్నాయని చెప్తున్నారు వైద్య విశ్లేషకులు. దీంతో దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెంచాయి. ఈ క్రమంలోనే అమెరికా సైతం అప్రమత్తమయింది.
రెండు డోసుల వ్యాక్సిన్...
ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది యూఎస్ ఎంబసీ. ఏ దేశం నుంచి వచ్చే పౌరులైనా.. మరో దేశానికి వెళ్లి తిరిగి స్వదేశానికి వచ్చే అమెరికా పౌరులు, నివాసితులు అయినా సరే ప్రయాణానికి ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని షరతు విధించింది. కోవిడ్ నెగిటివ్ ఉంటేనే యూఎస్ ప్రయాణానికి అనుమతి ఉంటుందని, లేదంటే అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. అలాగే రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు కూడా సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది.
Next Story