Sat Nov 23 2024 02:06:20 GMT+0000 (Coordinated Universal Time)
ఖాన్ దాదాకు ఘోర అవమానం
పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది. అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ఇక ఇంట ి దారి పట్టినట్లే
పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది. అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ఇక ఇంట ి దారి పట్టినట్లే. పాకిస్థాన్ లో అవిశ్వాసం ద్వారా పదవి కోల్పోయిన తొలి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రికార్డులకు ఎక్కారు. మొత్తం పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులున్నారు. అయితే అవిశ్వాస తీర్మానంపై ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.
ఉత్కంఠ మధ్య....
స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించినా న్యాయస్థానం ఆదేశాలతో ఆదివారం తెల్లవారు జామున నాటకీయ పరిణామాల మధ్య అవిశ్వాసంపై ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సభ్యులు వాకౌట్చేశారు. మొత్తం మీద గత నెల రోజులుగా అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లే. ఈరోజు జాతీయ అసెంబ్లీ తదుపరి ప్రధానిని ఎన్నుకునే అవకాశముంది. ఈరోజు మరోసారి పాక్ అసెంబ్లీ సమావేశం కానుంది.
Next Story