Sun Dec 22 2024 20:57:18 GMT+0000 (Coordinated Universal Time)
24 గంటల్లో 312 సార్లు భూప్రకంపనలు
సిరియా, తుర్కియాలలో ఎనిమిది వేల మంది వరకూ భూకంపం కారణంగా మృత్యువాత పడ్డారు
సిరియాను భూకంపం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే వేల సంఖ్యలో మరణించారు. సిరియా, తుర్కియాలలో ఎనిమిది వేల మంది వరకూ భూకంపం కారణంగా మృత్యువాత పడ్డారు. సహాయక చర్యలు సక్రమంగా కొనసాగడం లేదు. మంచు కురుస్తున్నందున కారణంగా శిధిలాల తొలగింపు ప్రక్రియ ఆలస్యమవుతుంది. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్దీ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
వరస ప్రకంపనలతో...
వరసగా భూకంపాలు వస్తుండటంతో ప్రజలు భవనాల్లో ఉండేందుకే భయపడిపోతున్నారు. ఈరోజు కూడా భూకంపం వస్తుందని హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు వచ్చేశారు. ఒక్క తుర్కియాలోనే ఆరువేల భవనాలు నేలమట్టమయ్యాయి. వరసగా భూప్రకంపనలు వస్తుండంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. సైన్యం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి బాధితుల కోసం ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. ప్రపంచ దేశాలన్నీ భూకంప బాధిత దేశాలైన తుర్కియా, సిరియాలకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. రష్యా, భారత్ నుంచి ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టేందుకు సహాయక బృందాలు బయలుదేరి వెళ్లాయి.
- Tags
- earthquake
- syria
Next Story