Mon Dec 23 2024 07:39:15 GMT+0000 (Coordinated Universal Time)
భర్తకు విడాకులు.. కుక్కతో ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత ?
బ్రిటన్ కు చెందిన ఒక మహిళ జీవితంలో. మనస్పర్థలతో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది
భార్య భర్తలు అన్నాక ఏదోక విషయంలో మనస్పర్థలు, గొడవలు వస్తూనే ఉంటాయి. ఆలుమగల అనుబంధం పరస్పరం సర్దుకుపోయేదానిపై ఆధారపడి ఉంటుంది. తప్పు నీదంటే నీదే అని.. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ పోతే.. ఆ బంధం తెగిపోతుంది. ఇదే జరిగింది బ్రిటన్ కు చెందిన ఒక మహిళ జీవితంలో. మనస్పర్థలతో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది అమండా రోడ్జర్స్ అనే మహిళ. ఆ తర్వాత తన పెంపుడు కుక్కనే పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా.. ఇప్పుడు ఆ కుక్కతో చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా చెప్తోంది అమండా.
విడాకులు పొందిన తర్వాత...
భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత కొంతకాలంపాటు ఒంటరిగానే జీవితాన్ని గడిపిందట అమండా. ఆ సమయంలోనే తన పెంపుడు కుక్కతో ప్రేమలో పడింది. దాని పేరు షెబా. రెండు నెలల వయసు ఉన్నప్పటి నుంచి అమండా షెబాతో ప్రేమలో పడింది. షీబాకు మోకాళ్లపై నిల్చొని ప్రపోజ్ చేసిందట అమండా.. అందుకు షెబా కూడా తోక ఊపి అంగీకారం తెలిపిందని చెప్తోంది అమండా. ఆ తర్వాత 200 మంది బంధుమిత్రుల సమక్షంలో తన పెంపుడు కుక్క షెబాను పెళ్లాడింది. అప్పటి నుంచి తన జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుందని చెప్పింది అమండా రోడ్జర్స్. నిజానికి తన భర్తతో ఉన్నప్పటి కంటే.. ఇప్పుడే చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపిందామె. ఇది తెలిసిన వారంతా కుక్కను పెళ్లాడటం, ఆపై సంతోషంగా ఉండటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.
Next Story